
మురిసిన భక్తజనం
అమ్మవారి దర్శనానికి
విచ్చేసిన భక్తజనం
అమ్మవారి దర్శనానికి
విచ్చేసిన భక్తజనం
ముగిసిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు ● ముర్రాటలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోటబొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి

మురిసిన భక్తజనం