
27 వరకు వర్షాలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ స్థితిగతులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన ప్రత్యేక బులెటిన్‌ను ఆయన జిల్లా అధికారులకు చేరవేస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా 24, 25 తేదీల్లో కొద్దిచోట్ల అతి భారీ వర్షాలు నమో దు కావచ్చని చెప్పారు. ఇప్పటికే సముద్రంలో గాలుల వేగం గంటకు 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం కవిటి వర కూ తీరంలో 3.0 నుంచి 3.8 మీటర్ల వరకూ అలలు ఎగసిపడే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. తీరప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక బస కేంద్రాలు సిద్ధం చేయాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. ప్రతి మండలంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, విద్యుత్తు, ఆరోగ్య శాఖల సమన్వయంతో నిఘా ఏర్పాటు చేయా లని కలెక్టర్ ఆదేశించారు. పాతపట్నం, కొత్తూ రు, ఇచ్ఛాపురం, కవిటి, నందిగాం, సంతబమ్మాళి, గార మండలాల్లో అత్యవసర పరిస్థితులకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అవసరమైతే ఎమర్జెన్సీ నంబర్లు
విపత్తుల సందర్భంలో స్పందన కోసం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా 112, 1070, 18004250101 నంబర్లకు లేదా soec apsdma@ap.gov.in మెయిల్‌కు సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ్ఞప్తి చేశారు.