
నేడు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం
నరసన్నపేట: శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివల స జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమా వేశం ఉదయం 10 గంటల కు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. జిల్లాలో పార్టీ నిర్మాణం, రీకాలింగ్ చంద్రబా బు, ఇంటింటి ప్రచార కార్యక్రమాల పురోగతిపై సమీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే గ్రామ కమిటీల ఏర్పాటుపై సమీక్ష ఉంటుందన్నారు. సమావేశానికి పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కుంభా రవిబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
వ్యవసాయాధికారులపై
కలెక్టర్ సీరియస్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో ఎరువుల కొరత ఉందని, ప్రతి గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయాధికారులపై సీరియస్ అయ్యారు. శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో వ్యవసాయ సంచాలకు లు, వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసా య సహాయకులు, సొసైటీ ప్యాక్ సీఈఓలతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం ని ర్వహించారు. కలెక్టరేట్‌లో ఎరువులకు సంబందించిన ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటుచేశామని ప్రతి ఒక్క రైతుకు తెలియజేయా లని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉద్యోగాలు చేయడం మంచిది కాదని, రైతులకు ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులపై వేటు తప్పదన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వద్ద సమగ్ర సమాచారం లేకపోవడం, అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాట్ ప్రకారం కూపన్ పద్ధతిలో సరఫరా చేసే తేదీ, సమయం తెలియజే యాలన్నారు.

నేడు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం