
800 ఎకరాల్లో వరి పంట ముంపు
తురకపేట సమీపంలో మునిగిపోయిన వరిపొలాలు
సరుబుజ్జిలి: అల్పపీడన ప్రభావానికి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కిందకు ప్రవహిస్తుండడంతో శుక్రవారం బుడ్డివలస, తెలికిపెంట, పాతపాడు, అగ్రహారం, శాస్త్రులపేట, వీరమల్లిపేట, తురకపేట, వీరభద్రాపురం గ్రామాల్లో గల లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 800 ఎకరాల వరి పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు కబ్జా చేయడం వల్ల ఇలా వరద నీరు పొలాల మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.