
యుద్ధ వీరుల
గుండె చప్పుడు
నేడు
కార్గిల్ విజయ్ దివస్
ఎముకలు కొరికే చలి, దుర్బేధ్యమైన కొండల్లో ప్రయాణం, ఆగని గుళ్ల వర్షం.. కార్గిల్ యుద్ధం గురించి ఇలాంటి సాహసాలను దేశం కథలు కథలుగా చెప్పుకుంటోంది. పాతికేళ్ల తర్వాత కూడా ఆ విజయ గాథలు నేటి యువత నరనరాలను ఉత్తేజితం చేస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఉక్కు పిడికిలిలో బంధించి మట్టి కరిపించిన ఈ యుద్ధంలో 300 మంది సిక్కోలు ముద్దుబిడ్డలు కూడా పోరాడారు. ఇందులో పోలాకి మండలం రామయ్యవలస గ్రామంలోని చింతాడ మోహనరావు వీరమరణం పొందగా, మరో ఇద్దరు సైనికులు ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నంలో క్షతగాత్రులయ్యారు. ఆనాటి యుద్ధగాథను వారు ఇలా గుర్తు చేసుకున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ
సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి