
అమలు మైనస్
దారి ఖర్చులు ఇవ్వలేరా..?
రాకరాక వచ్చిన వానలు దారుల దారుణ రూపాలను బయటపెట్టాయి. గిరిజన గ్రామాలు, చిన్న చిన్న పల్లెలను కలిపే రహదారులు చిన్నపాటి చినుకులకే చిత్తడిగా మారిపోయాయి. ఇక పెద్ద వర్షాలు పడితే తమ గతేమవుతుందని ఆయా ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానలు రాక ముందే వీటిని బాగు చేసి ఉంటే తమకు ఈ అవస్థ తప్పేదని అంటున్నారు.
‘హైస్కూల్ ప్లస్’..
● హైస్కూల్ ప్లస్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ● వెంటాడుతున్న అధ్యాపకుల కొరత ● కానరాని మౌలిక సదుపాయాలు ● ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
నరసన్నపేట:
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలకు ఉన్నత విద్యను అందించేందుకు గత ప్రభుత్వం హైస్కూల్ ప్లస్‌లను ప్రవేశ పెట్టింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా 2022 విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ అమలు చేస్తున్నారు. దీంతో రూరల్ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్ అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో నరసన్నపేట మండలం ఉర్లాం, టెక్కలి (బాలికోన్నత పాఠశాల), వజ్రపుకొత్తూరు, మందస మండలం హరిపురం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహణతర్లాలో వీటిని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు అంతంతగానే ఉన్నా తర్వాత సంవత్సరం బాగా పెరిగాయి. ఆయా ప్రాంత బాలికల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. చెంతనే 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యా బోధన లభిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. సబ్జెక్టులకు అవసరమైన అధ్యాపకులను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అంతా సవ్యంగా సాగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ హైస్కూల్ ప్లస్ విద్యపై శీత కన్ను వేసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఫలితంగా ప్లస్ టూ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. వీటిని ఎత్తివేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో వి ద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వెంటాడుతున్న అధ్యాపకుల కొరత
హైస్కూల్ ప్లస్‌టూ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40 సీట్లు చొప్పున ఒక్కో విద్యా సంవత్సరంలో 80 సీ ట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 6 హైస్కూల్స్‌లో ప్లస్ టూ కళాశాలల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్క టెక్కలి తప్ప మిగిలిన ప్లస్ టూ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు అంత ఆశాజనకంగా లేవు. దీనికి కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ప్లస్ టూ కళాశాలలో ఏడుగురు లెక్చరర్లు ఉండాలి. జిల్లాలో టెక్కలి, వజ్రపుకొత్తూరుల్లో తప్ప మిగిలిన చోట్ల అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. ఉర్లాంలో బోట నీ, తెలుగు, ఇంగ్లిష్‌లకు పూర్తి స్థాయిలో అధ్యాపకు లు ఉండగా కెమిస్ట్రీ సబ్జెక్టును లుకలాం స్కూల్ నుంచి ఒక టీచర్ వచ్చి బోధిస్తున్నారు. మిగిలిన ఫి జిక్స్, లెక్కలు, జువాలజీ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే రొట్టవలసలో కూడా నా లుగు సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. హరిపురంలో లెక్కలు, జువాలజీ సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు.
సౌకర్యాలు కావాలి
ఉర్లాం ప్రాంతానికి జూనియర్ కళాశాల కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ధర్మాన కృష్ణదాస్ కృషి వల్ల గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచనా విధానం వల న ఉర్లాం హైస్కూల్లో రెండేళ్ల కిందట ఇంటర్ తరగతుల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. మా ప్రాంతం వాళ్లు ఆనందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వర్యం చేయడాని కి చూస్తోంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటు తున్నా వసతులు మెరుగు పరచలేదు.
– పోలాకి నర్సింహమూర్తి, సర్పంచ్ ఉర్లాం
మెరుగు పడని వసతులు..
ప్లస్ టూ కళాశాలల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రాక్టిక ల్స్ చేసుకునేందుకు తగిన సదుపాయాలు లేవు. తరగతి గదుల కొరత అధికంగా ఉంది. అలాగే ఆఫీస్ వర్క్ చేసేందుకు తగిన సిబ్బంది కొరత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సదుపాయాలు మెరుగు పడలేదు. ఉర్లాంలో ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి రొట్టవలస, బ్రాహ్మణతర్లాలో కూ డా ఉంది. అన్ని చోట్ల ప్రాక్టికల్స్ ల్యాబ్స్ లేవు. వసతులు మెరుగు పరచాలని, ఈ కళాశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అదనపు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సౌకర్యాలు మెరుగు పరచాలి
గత ప్రభుత్వం తీసుకొచ్చి న ఈ ప్లస్ టూ కళాశాలల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ఇంటర్ విద్య అందుబాటులోకి వచ్చింది. కానీ దీనిపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అధ్యాపకులను నియమించకుండా తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వం అమలులోనికి తెచ్చిన ఈ ప్లస్ టూ కళాశాలలను పటిష్టం చేయాలి.
– తమ్మినాన చందనరావు,
ఏపీఎస్‌టీఏ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అమలు మైనస్

అమలు మైనస్

అమలు మైనస్

అమలు మైనస్

అమలు మైనస్