చంద్రబాబుది ఎన్నికల స్టంట్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది ఎన్నికల స్టంట్‌

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

పెనుకొండ రూరల్‌: స్థానిక సంస్థల్లో బీసీ ఓట్లు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌ీసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. ఆదివారం మండంలోని గోనిపేట, మరువపల్లి, శెట్టిపల్లి, కురుబవాండ్లపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డులను కార్యకర్తలకు అందచేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి బీసీలపై ఉన్నది కపట ప్రేమ మాత్రమే అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, బిహార్‌, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లో 60 శాతం పైబడి ఉన్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు వర్తించాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధనలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం సరైన రీతిలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను విస్మరించి వంచనకు గురిచేశారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం మళ్లీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. సమస్యను సృష్టించేది, ఆ సమస్యను మళ్లీ పరిష్కరించినట్లు నాటకం ఆడేది కూడా టీడీపీనేనన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2021లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకై ప్రణాళిక సిద్ధం చేస్తే, అప్పటి ప్రతి పక్ష పార్టీ సానుభూతిపరుల ద్వారా హైకోర్టులో అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా, 9వ షెడ్యూల్‌ సవరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు నరసింహా, సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నాగరాజు, మాజీ ఎంపీటీసీ శివయ్య, చెన్నకేశవులు, పూజారి నాగేంద్ర, కొండలరాయుడు, కంబాలప్ప, గోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement