నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

ప్రశాంతి నిలయం: పుట్టపర్తి పరిధిలోని ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలీస్‌ కార్యాలయంలో ..

పుట్టపర్తి టౌన్‌: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

పోలీసుల అదుపులో

సెల్‌ఫోన్‌ దొంగల ముఠా

ధర్మవరం అర్బన్‌: ప్రజలు, ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న నలుగురు సభ్యులున్న దొంగల ముఠాను వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా పలు ప్రాంతాల్లో పలువురి వద్ద సెల్‌ఫోన్లు కొట్టేసి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న డోన్‌ ప్రాంతానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు తెలియజేయాల్సి ఉంది.

సచివాలయ ఉద్యోగుల జిల్లా నూతన కమిటీ ఎంపిక

పుట్టపర్తి టౌన్‌: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గోరంట్లలోని కేకే ఫంక్షన్‌ హాల్లో జిల్లా ఉద్యోగులు సమావేశమై సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వై.సుదర్శన్‌, ఉపాధ్యక్షుడిగా డి.చౌడప్ప, ఎమ్‌.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శిగా యూ.కార్తిక్‌, మహిళా సెక్రటరీలుగా శాంతి, పద్మ, ట్రెజరర్‌గా వెంకటరెడ్డి, లీగల్‌ సెక్రటరీగా ప్రదీప్‌కుమార్‌, ప్రచార కార్యదర్శులుగా తుకారాం, కరీముల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఎంపికై న సభ్యులను పూలమాలలు, శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 4,500 మంది సచివాలయ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 46 మందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement