● మహిళా స్నేహ పూర్వక పంచాయతీగా గుర్తింపు
● గ్రామంలో పర్యటించిన కేంద్రం బృందం
అగళి: మండల పరిధిలోని నరసంబూది గ్రామానికి ప్రత్యేక గౌరవం దక్కింది. ఈ పంచాయతీని మహిళా స్నేహ పూర్వక పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో
గ్రామంలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. శివయ్య నేతృత్వంలోని బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టబోయే కార్యచరణపై చర్చించారు. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ కార్యక్రమం కింద పంచాయతీకి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి, ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ హరికుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లీలావతి, డిప్యూటీ ఎంపీడీఓలు రెడ్డి ప్రకాష్, పద్మ, మండల వ్యవసాయ ఆధికారి నాగరాజు, కార్యదర్శులు పరమేష్, రంగనాథ్, మహేష్ పాల్గొన్నారు.


