ఘనంగా రెవెన్యూ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రెవెన్యూ దినోత్సవం

Jun 21 2026 12:13 AM | Updated on Jun 21 2026 12:13 AM

ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో శనివారం జిల్లా స్థాయి రెవెన్యూ దినోత్సవాన్ని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల నిరంతర సేవలో మమేకమైన పురాతన శాఖ రెవెన్యూ అని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి వారధిలా పని చేస్తుందన్నారు. రైతాంగానికి మరింత మెరుగైన, వేగవంత మైన సేవలు అందించేందుకు ప్రతి రెవెన్యూ ఉద్యోగి సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. సుదీర్ఘంగా సేవలు అందించిన విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ విశ్వనాథ్‌, గోపాలక్రిష్ణ, తహసీల్దార్‌ చలపతి, డీటీలు గుప్తా, నాగార్జునశెట్టి, నారాయణస్వామి, జూనియర్‌ సహాయకులు బాబా, వీఆర్‌ఓ లక్ష్మీనారా యణరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయ భారతి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.విజయశంకరబాబు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ 3.2 మి.మీ, 22న 3.8 మి.మీ, 23న 2.2 మి.మీ, 24న 1.7 మి.మీ సగటువర్షపాతం నమోదు కావొచ్చన్నారు. అక్కడ క్కడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందన్నారు. కనీసం 20 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలు విత్తుకునేందుకు అనుకూలమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement