వ్యభిచార గృహం నిర్వాహకుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహం నిర్వాహకుల అరెస్ట్‌

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

తాడిపత్రి టౌన్‌: పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గరు మహిళలను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అలివేలమ్మ అనే మహిళ పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో గత కొద్ది నెలలుగా అద్దెకు ఇళ్లు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆదివారం స్థానికులు 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయడంతో రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలివేలమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

మద్యానికి డబ్బుల్లేక

వ్యక్తి ఆత్మహత్య

మడకశిర రూరల్‌: మండల పరిధిలోని ఆర్‌.అనంతపురం గ్రామానికి చెందిన శాంతప్ప (45) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. శాంతప్పకు మద్యం అలవాటు ఉండేది. తాగుడు మానుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు తరచుగా బుద్ధి చెప్పినా శాంతప్ప వినేవాడుకాదు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు. మద్యం సేవించడానికి డబ్బులు లేక పోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంతో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చదువుతో

దేన్నైనా సాధించవచ్చు

పుట్టపర్తి టౌన్‌: ‘చదువుతోనే దేనిన్నైనా సాధించవచ్చు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదుకోవాలి’ అని కాపునాడు జిల్లా అధ్యక్షుడు మహేష్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో కాపునాడు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 450 పైగా మార్కులు సాధించిన బలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమానికి మీనాక్షమ్మ సమ్మలిత వికాస కేంద్రం చైర్మన్‌ రవికాంత్‌ రమణ, కాపునాడు రాయలసీమ అధ్యక్షుడు పాండురంగయ్య, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ పూల శివప్రసాద్‌, జనసేన పార్టీ నాయకుడు తోట్ల గంగాధర్‌ హాజరై విద్యార్థులను శాలువలతో సత్కరించి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు నరేంద్ర రాయల్‌, గువ్వల శ్రీనివాసులు, రమేష్‌బాబు, నాగభూషణ, శంకర, ప్రవీణ్‌, సరేష్‌, కార్తీక్‌, మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో

గంజాయి సరఫరాదారులు

గుత్తి: గుత్తి పోలీసులు ఆదివారం రాత్రి ఇద్దరు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పట్టణంలోని ఓ షాపులో గంజాయి, నకిలీ నోట్లు దొరికాయి. షాపు నిర్వాహకుడిని విచారించగా.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్‌ వాటిని ఇక్కడ ఉంచినట్లు చెప్పాడు. దీంతో గోపాల్‌తో పాటు దిమ్మగుడికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ లోతుగా విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement