రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలనేది దుర్మార్గపు ఆలోచన. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. మడకశిర వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనకు దక్కుతాయి. చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం తెలంగాణ వద్ద మన నీళ్లను తాకట్టు పెడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటా రైతులకు నష్టమే. బోరుబావులు ఎండిపోతున్నాయి. వర్షాలు లేక పంటలు చేతికందడం లేదు. అరకొరగా దక్కినా గిట్టుబాటు కావడం లేదు. – ఈరలక్కప్ప, మడకశిర సమన్వయకర్త


