ఆనాటి స్నేహం.. ఆనంద గీతం | - | Sakshi
Sakshi News home page

ఆనాటి స్నేహం.. ఆనంద గీతం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

40 ఏళ్లకు పూర్వ విద్యార్థుల

అపూర్వ కలయక

అగళి: మండలంలోని అగళి, ఇరిగేపల్లి వద్ద సువర్ణముఖి నదిపై వంతెన కూలిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అగళి నుంచి ఇరిగేపల్లి, నందరాజునపల్లి తదితర గ్రామలకు వైపునకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో భారీ సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కూలిపోయింది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలకు నిషేధించారు. వాహనాల రాకపోకలకు వీలుగా పక్కనే డైవర్షన్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో ఆ రోడ్డులో బురద ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

27ఎండీకెఎస్‌203: ధ్వంసమైన ఇరిగేపల్లి వంతెన

40 ఏళ్ల తర్వాత స్నేహితులందరూ ఒక్కచోట చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రొద్దం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1986– 87 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 86 మంది పదో తరగతి వరకూ కలసి చదువుకోగా.. ప్రస్తుతం 70 మంది దాకా తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. సుమారు 40 ఏళ్లకు ఒకే వేదికపైకి రావడంతో అందరూ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులకు ప్రేమతో అభివాదం చేశారు. వారిని ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు.

– రొద్దం:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement