హత్యా రాజకీయాలకు కేరాఫ్ కందికుంట
కదిరి టౌన్: ‘హత్య రాజకీయాలకు కేరాఫ్ కందికుంట.. నకిలీ డీడీల కుంభకోణం కేసులో అతని ప్రమేయం ఉందని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 19న కేసు విచారణ కూడా ఉంది. అలాంటి కందికుంటకు వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు’ అని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. మంగళవారం కదిరి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్బూల్ అహ్మద్ మాట్లాడారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. ఆయన వచ్చిన తరువాత కదిరి అభివృద్ధి పూర్తిగా కుటుంపడిందన్నారు. ఫిబ్రవరిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని. కానీ నేటికీ కోనేరు ఎప్పుడు సిద్ధం కాలేదన్నారు. గత ప్రభుత్వంలో తాము రాయలసీమ సర్కిల్ నుంచి కోనేరు వరకూ రోడ్డు విస్తరణ పనులు చేపడితే.. టీడీపీ నాయకులు
అడ్డుపడ్డారని, నష్టపరిహారం ఇచ్చి పనులు చేయాలని అప్పుడు డిమాండ్ చేశారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉన్నందున రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కందికుంట కేవలం మాటలు చెప్పి తప్పుకునే రకమన్నారు. మాజీ మంత్రి షాకిర్‌ను అడిగితే కందికుంట పుట్టు పుర్వోత్తరాలు, చేసిన పాపాలన్నీ తెలుస్తాయన్నారు. కందికుంట కక్ష రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చి కదిరి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనవి కూడా అమలు చేశారన్నారు. ఇకపై వైఎస్ జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి లింగాల కృపాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, కన్వీనర్లు మనికంఠనాయక్, అశోక్‌వర్ధన్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి రాజేంద్రప్రసాద్, యూత్ అధ్యక్షుడు రమేష్‌యాదవ్, బాబా, ఇమ్రాన్, యసన తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను విమర్శించేస్థాయి ఆయనకెక్కడిది?
విలేకరుల సమావేశంలో
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్


