రీసర్వే పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ల్యాండ్ సర్వే అధికారులను కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ–సర్వే, పీజీఆర్‌ఎస్, స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ల జాబితా మ్యాపింగ్, హౌసింగ్, భూసేకరణతో పాటు పాటు రెవెన్యూ అంశాలపై ఆర్‌డీఓలు , తహసీల్దార్లు , వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ దశల్లో జరుగుతన్న రీసర్వే పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే పనులను ఆర్డీఓలు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్‌కుమార్, సర్వేశాఖ ఏడీఈ విజయశాంతిబాయి, డీఆర్‌ఓ రామసుబ్బయ్య తదితరలు పాల్గొన్నారు.
కదిరి అర్బన్: రైతులు కలిసిమెలసి వ్యవసాయం చేసుకుంటే సత్వరం అభివృద్ధి చెందుతారని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి మండల పరిధిలోని కదిరి బత్తలపల్లి రోడ్డులో ఉండే గ్రాండ్ ఈవెంట్ ఫంక్షన్ హాల్లో అతియా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెట్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సాధికారికత సాధించాలన్నారు. చిన్న కమతాలతో దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యం తక్కువగా ఉంటుందన్నారు. ఎఫ్‌పీఓ ఉన్న సభ్యులందరూ ఉమ్మడిగా రుణాలు తీసుకుని వ్యవసాయం చేస్తే లాభాలు బాగా వస్తాయన్నారు. నాబార్డు లోన్లు కూడా సులువుగా వస్తాయన్నారు. చియాసీడ్స్, రెడ్‌గ్రామ్స్ పంటల సాగులో పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువగా వస్తాయని రైతులు వాటిని సాగు చేయాలని సూచించారు. అంతకుముందు పంటల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్
సమష్టి వ్యవసాయంతో అభివృద్ధి


