కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం

Dec 10 2025 9:18 AM | Updated on Dec 10 2025 9:18 AM

కేజీబ

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం

మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిర్వహణ లోపాల కారణంగా కస్తూరిబా గురుకుల బాలిక విద్యాలయ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఇందుకు మడకశిర నియోజకవర్గంలోని కేజీబీవీల నిర్వహణ అద్దం పడుతున్నాయి. నియోజకవర్గంలో అమరాపురం, రొళ్ల (ఆవినకుంట), గుడిబండ (కరికెర), అగళి, మడకశిర (గుండుమల)లో కేజీబీవీలు ఉన్నాయి. అన్నింటిలోనూ 6 నుంచి ఇంటర్‌ వరకూ తరగతులును నిర్వహిస్తుండగా మొత్తం 1,282 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

అస్తవ్యస్తంగా నిర్వహణ

మడకశిర నియోజకవర్గంలోని కేజీబీవీలు జిల్లా కేంద్రానికి సుదూరంగా కర్ణాటక సరిహద్దున ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల తనిఖీల ఊసే లేకుండా పోయింది. దీంతో కేజీబీవీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేజీబీవీల్లో సరైన వసతులు లేకపోవడం, భోజనంలో నాణ్యత లోపంచడం తదితర సమస్యలతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీబీవీల నిర్వహణను ఎంతో గొప్పగా ఊహించుకున్న ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టి కంగు తిన్నారు. కుళ్లిన కూరగాయలను వంటకు ఉపయోగించడం, 253 మంది బాలికలకు రెండంటే రెండే మరుగు దొడ్లు ఉండడం, భోజనంలో నాణ్యత లోపించడం, కుళ్లిన అరటి పండ్లను ఇస్తుండడం, అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం తదితర సమస్యలు గుర్తించిన ఎమ్మెల్యే నోట మాట లేకుండా పోయింది.

ఎంఈఓల పర్యవేక్షణ కరువు

కేజీబీవీలను తరచూ ఎంఈఓలు తనిఖీ చేయాల్సి ఉండగా.. మడకశిర నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వహణ గాడి తప్పింది. సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థినుల బాగోగులను గాలికి వదిలేశారు. తన తనిఖీల్లో వాస్తవాలను గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిని తీవ్ర స్థాయిలో మందలించినా.. సదరు సిబ్బందిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చివరకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ సోమవారం తనిఖీ చేపట్టన తర్వాత అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు

నాణ్యతలేని భోజనంతో ఇబ్బందులు

ఎంఈఓల పర్యవేక్షణ

నామమాత్రం

మడకశిర మండలం గుండుమలలోని కేజీబీవీ పాఠశాల ఇది. 6 నుంచి పదో తరగతి వరకు 208 మంది, ఇంటర్‌లో 45 మంది విద్యార్థినులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సొంత గ్రామం కావడంతో కేజీబీవీలో ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వంలో కేజీబీవీల నిర్వహణ సక్రమంగా ఉందని నిరూపించాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఎంతో ఆశతో ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అయితే ఆయన ఆశ అడియాసగానే మారింది. కేజీబీవీ నిర్వహణలో అనేక లోపాలు గుర్తించిన ఆయన నోట మాట రాలేదు. దీంతో అక్కడి సిబ్బందిపై తనదైన శైలిలో మండిపడ్డారు.

సమస్యలు పరిష్కరించాలి

చంద్రబాబు ప్రభుత్వానికి విద్యారంగ సమస్యలపై చిత్తశుద్ధి లేదు. దీంతో కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగాన్ని పటిష్టం చేశారు. దీంతో బోధనాప్రమాణాలు మెరుగుపడి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రస్తుతం కేవలం ప్రచార ఆర్భాటానికే పాలకులు పరిమితమై విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మార్పు రావాలి. కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

– ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మడకశిర

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం 1
1/2

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం 2
2/2

కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement