భోజనం నాణ్యతలో రాజీ పడద్దు
చెన్నేకొత్తపల్లి/ముదిగుబ్బ: వసతి గృహాలు, పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు ఇచ్చే భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని నిర్వాహకులను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం, సీకేపల్లి గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. సీకేపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహం, ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం, ఎంఎల్‌ఎస్ పాయింట్, కొత్త బీసీ కాలనీలోని చౌకధాన్యపు డిపోను పరిశీలించారు. కేజీబీవీలో నాసిరకం కోడిగుడ్లను గమనించి అసహనం వ్యక్తంచేశారు. నాగసముద్రంలోని ప్రాథమిక పాఠశాలలో వంటగది శుభ్రంగా లేకపోవడం, కాలం చెల్లిన చెక్కీలను గమనించిన ఆమె హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని సరుకులను వాడుతున్నందుకు గాను ఆ పాఠశాల హెచ్‌ఎంకు షోకాజు నోటీసు జారీ చేయాలని ఎంఈఓ ప్రసూన్‌కుమార్‌నాయుడికి సూచించారు. ఆమె వెంట డీఈఓ కిష్టప్ప, ఐసీడీయస్, పౌరసరఫరాల అధికారులు, చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణుడు ఉన్నారు. అలాగే ముదిగుబ్బలోని కేజీబీవీ, అంగన్ వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక సీమంతం కార్యక్రమంలోపాల్గొన్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో తనిఖీలు
ధర్మవరం రూరల్/కదిరి అర్బన్: స్థానిక మార్కెట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను మంగళవారం ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి తనిఖీ చేశారు. రికార్డులు, నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో స్టాక్ పాయింట్ అధికారి ప్రసన్నకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కదిరి మండలం కాళసముద్రం అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కదిరిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.
అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి


