సారూ..సమస్యలు తీర్చండి
ప్రశాంతి నిలయం: ‘‘నెలల తరబడి తిరుగుతున్నాం...ఇక్కడే రెండు, మూడు సార్లు అర్జీలిచ్చాం. అయినా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మాపై దయతలచి సమస్యలు తీర్చండి సారూ’’ అంటూ జనం కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశం మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 331 అర్జీలు సమర్పించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని సమస్యలుంటే అర్జీదారుకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ రామసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.
‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు వినతుల వెల్లువ
వివిధ సమస్యలపై 331 అర్జీలు


