సంతకం.. సమరనాదం
సాక్షి నెట్‌వర్క్: మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నిరుపేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు నినదించారు. వైద్యం, విద్య ప్రజల హక్కు అని, ఆ హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాయొద్దని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకు సాగితే తమ సత్తా చూపుతామని కోటి సంతకాలతో సమరనాదం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లా అంతటా ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ నాయకులు వైద్య కళాశాలలపై సర్కారు కుట్రను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వైద్య కళాశాలలను పరిరక్షించుకునేందుకు విద్యార్థులు, యువత, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలూ ముందుకు వచ్చి సంతకాలు చేశారు.
● కదిరి నియోజకవర్గం ఎన్‌పీకుంట మండలం వెలిచలమల, పడమర నడిమిపల్లి పంచాయతీల్లో సోమవారం వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవిందునాయక్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
● పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం ఎంబీక్రాస్‌లో పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్వంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించారు.
● పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంజలి ఆధ్వర్యంలో అమరాపురం మండలం చిట్నడకు, ఆలదపల్లిలో చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది.
ఊరూరా సాగుతున్న
కోటి సంతకాల సేకరణ
స్వచ్ఛందంగా
మద్దతు తెలుపుతున్న ప్రజలు


