ప్రతిపాదనకే పరిమితమా? | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనకే పరిమితమా?

Dec 2 2025 9:42 AM | Updated on Dec 2 2025 9:42 AM

ప్రతి

ప్రతిపాదనకే పరిమితమా?

మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకే పరిమితమైపోయింది. నియోజకవర్గంలో మడకశిర అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లన్నీ కర్ణాటక సరిహద్దులోనే ఉన్నాయి. ఇవన్నీ పెనుకొండ పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో కొనసాగుతున్నాయి. పెనుకొండకు మడకశిర 42, గుడిబండ 65, అమరాపురం 85, అగళి 85, రొళ్ల 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర నియోజకవర్గంలోని ప్రజలు పనుల నిమిత్తం డీఎస్పీని కలవాలంటే పెనుకొండకు పోవాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకుని ఉంది. దీంతో మడకశిర కేంద్రంగా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్ల నుంచి ఉంది. గతంలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఇక్కడ పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై పరిశీలన కూడా చేశారు. అయినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే సర్కిల్‌ విభజన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర పోలీస్‌ సర్కిల్‌ను విభజించారు. ప్రత్యేకంగా మడకశిర రూరల్‌ సర్కిల్‌ ఏర్పాటైంది. రూరల్‌ సర్కిల్‌ పరిధిలోకి గుడిబండ, అమరాపురం, రొళ్ల, అగళి పోలీస్‌ స్టేషన్లను చేర్చారు. రూరల్‌ సర్కిల్‌కు సీఐని నియమించారు. అలాగే మడకశిర పోలీస్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి, సీఐని కేటాయించారు. ఈ అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి మడకశిర మున్సిపాలిటీ, మడకశిర రూరల్‌ మండలాన్ని చేర్చారు. మడకశిర కేంద్రంగా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేస్తే పరిపాలనాపరంగా సులభంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని నెలల కిందట ఈ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర హోం మంత్రి.. మడకశిర కేంద్రంగా పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మడకశిరలోనే ఏర్పాటు చేయాలి

మడకశిర కేంద్రంగా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సుదూరంగా ఉన్న పెనుకొండ పోలీస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయానికి వెళ్లడం ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కనుక మడకశిరలోనే పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి హోంమంత్రి తన హామీ నిలబెట్టుకోవాలి.

– ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ

నియోజకవర్గ సమన్వయకర్త, మడకశిర

కార్య రూపం దాల్చని మడకశిర

పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు

ప్రతిపాదనకే పరిమితమా? 1
1/1

ప్రతిపాదనకే పరిమితమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement