హాస్టళ్ల పర్యవేక్షణ తప్పనిసరి
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వ వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నీరు అందేలా చూడటంతో పాటు పారిశుధ్యం మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వసతి గృహాల్లో మెరుగైన చర్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆర్టీజీఎస్, స్వామిత్వ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన నీరు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. కళాశాలల్లో అడల్ట్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన పెంచాలన్నారు. ఇందుకు పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. అనంతరం స్వామిత్వ, ఆర్టీజీఎస్, డాక్యుమెంట్ అప్‌లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం,
శుద్ధజలం అందేలా చూడాలి
మున్సిపాలిటీల్లో పారిశుధ్యం
మెరుగుపడాలి
అధికారులకు కలెక్టర్
శ్యాం ప్రసాద్ ఆదేశం


