కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
అనంతపురం: జాతీయ లోక్ అదాలత్‌లో అధికంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు పేర్కొన్నారు. జిల్లా కోర్టులో గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, ఎకై ్సజ్ కేసులతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. సమావేశంలో మొదటి అడిషనల్ జిల్లా జడ్జి సత్యవాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, జూనియర్ సివిల్ జడ్జిలు బాలకోటేశ్వరరావు, హారిక, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఏ. శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, ఎకై ్సజ్ అధికారి ఎస్. రేవతి తదితరులు పాల్గొన్నారు.
బిలాస్‌పూర్–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బిలాస్‌పూర్–యలహంక మధ్య వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. 5 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు వివరించారు. డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బిలాస్‌పూర్ జంక్షన్ (08261)లో రైలు బయలుదేరి మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు యలహంక జంక్షన్‌కు చేరుతుందన్నారు. అదేవిధంగా యలహంక జంక్షన్ (08262) నుంచి డిసెంబర్ 3 బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజూమున 4.30 గంటలకు రైలు చేరుతుందన్నారు. భాతాపుర, రాయపూర్, దుర్గ్, చందా పోర్ట్, సిరిపూర్, మంచర్ల ఖాజాపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డిగ్రీ నూతన సిలబస్‌కు ఆమోదం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి నూతన సిలబస్‌ను ఆమోదించారు. గురువారం వర్సిటీలో ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత ఆధ్వర్యంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ కే. రాంగోపాల్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన సిలబస్‌ను ఎస్కేయూలో అమలు చేయడానికి వీలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఆమోదం తెలిపారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా కళాశాల– పరిశ్రమకు అనుసంధానం చేసేలా సిలబస్ రూపకల్పన జరిగినట్లు వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు తహసీల్దార్‌పై బదిలీ వేటు
నల్లచెరువు: మండల తహసీల్దార్ జమానుల్లా ఖాన్‌పై బదిలీ వేటు పడింది. ఆయన్ను కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న రవి నాయక్‌ను ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా నియమించారు. అధికార టీడీపీ నాయకుల భూదందాలకు సహకరించకపోవడంతోనే తహసీల్దార్ జమానుల్లా ఖాన్‌పై బదిలీ వేటు పడిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి


