‘చలి’గింతలు | - | Sakshi
Sakshi News home page

‘చలి’గింతలు

Nov 28 2025 7:14 AM | Updated on Nov 28 2025 7:14 AM

‘చలి’

‘చలి’గింతలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘చలి’ గింతలు పెరిగాయి. చలి పంజా మొదలు కావడంతో ప్రజలు గజగజలాడిపోతున్న పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతుండగా... రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం మరింత తగ్గిపోవడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం వేకువజామున మడకశిర మండలంలో 12.7 డిగ్రీలు, శెట్టూరులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ప్రస్తుతానికి ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు కావడం విశేషం. రొద్దం 13.8 డిగ్రీలు, సోమందేపల్లి 13.9 డిగ్రీలు, బెళుగుప్ప 14.1 డిగ్రీలు, అమరాపురం 14.1 డిగ్రీలు, గుడిబండ 14.3 డిగ్రీలు, గుమ్మఘట్ట 14.5 డిగ్రీలు, వజ్రకరూరు 14.9 డిగ్రీలు ఇలా చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా డిసెంబర్‌, జనవరి నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 12 డిగ్రీలకు పతనం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హీటర్లు, స్వెట్లర్లకు గిరాకీ పెరిగింది. రాత్రిళ్లు, ఉదయం పూట చలి నుంచి కాపాడుకునేందుకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు, బాలింతలు, గర్భిణులు, రోగులు, ఉదయం శ్రామిక వర్గాలు జాగ్త్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.

‘చలి’గింతలు 
1
1/1

‘చలి’గింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement