సాయి కీర్తనం.. స్వర సమ్మేళనం
ప్రశాంతి నిలయం: కర్ణాటక సంగీత రీతులలో సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ బృందం నిర్వహించిన కచేరీతో సత్యసాయి భక్తులు పరవశం చెందారు. బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధి చెంత ‘నాదశక్తి’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలతో సాగిన సంగీత కచేరీతో భక్తులు మైమరచిపోయారు.
ఆకట్టుకున్న తెప్పోత్సవం
బుధవారం రాత్రి చిత్రావతి నదిలో సత్యసాయి తెప్పోత్సవం కమనీయంగా సాగింది. సత్యసాయి చిత్రపటాన్ని తెప్పపై కొలువుదీర్చిన భక్తులు.. బాబాను కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు.
నేడు సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ సదస్సు
సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ సదస్సు గురువారం జరగనుంది. ఈ సదస్సులో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించనున్నారు.
సాయి కీర్తనం.. స్వర సమ్మేళనం
సాయి కీర్తనం.. స్వర సమ్మేళనం
సాయి కీర్తనం.. స్వర సమ్మేళనం


