20 గొర్రెల అపహరణ
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సుబ్బరాయనిపల్లిలో హరిజన సంజీవప్పకు చెందిన 20 గొర్రెలు అపహరణకు గురయ్యాయి. బాధితుడి వివరాలు మేరకు.. గత సోమవారం యథావిధిగా సంజీవప్ప తనకున్న 25 గొర్రెలను పొలాలకు తోలుకుని వెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి తనకున్న రప్పంలో గొర్రెలను ఉంచాడు. అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కనే ఉంటున్న గొర్రెల రప్పంలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. అక్కడున్న వాటిలో 20 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన సంజీవప్పకు కేవలం 5 గొర్రెలు మాత్రమే కనిపించాయి. వెంటనే మంగళవారం పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
పుట్టపర్తిలో విరివిగా
వైద్య సేవలు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఉచిత వైద్య శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు విరివిగా ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ప్రజా సంక్షేమశాఖ అధికారి డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జేడీ దేవసాగర్, ఎన్‌పీసీబీ సునీల్‌కుమార్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు, రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ బేగంతో పాటు ప్రోగ్రాం అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శత జయంతి వేడుకల్లో వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు. లింగ నిర్ధారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు రెండోరోజు కూడా కొనసాగాయి. మంగళవారం సాయంత్రం ఏఓ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీసాయి ఇంగ్లిష్ మీడియంకు చెందిన 35 మంది విద్యార్థులచే 20 పాటలకు నృత్యం గానం చేయించారు. పట్టణ ప్రముఖులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తన హాజరై కార్యక్రమాన్ని తలకించారు. 23వ తేదీ వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఆకట్టుకుంటున్న డ్వాక్రా ఎగ్జిబిషన్
పుట్టపర్తి అర్బన్: స్థానిక ఎనుములపల్లి వద్ద ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఏపీలోని 26 జిల్లాల నుంచి ఒక్కో ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. వాటిలో కోనుగోలు చేయడానికి ప్రజలు, సత్యసాయి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్టాల్స్ తెరిచి ఉంచుతున్నారు. ఈనెల 25 వరకూ స్టాల్స్ ఉంటాయి. సాయంత్రం డ్వాక్రా ఎగ్జిబిషన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టాల్స్‌లో ముఖ్యంగా ఆర్గానిక్ నూనెలు, తినుబండారాలు, పొడులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆత్రేయపురం పూత రేకులు, కాకినాడ ఖాజా, మిల్లెట్స్ తినుబండారాలు, మాడుగుల హల్వా, కొండపల్లి బొమ్మలు, చేనేత దుస్తులు ఇలా ఏది కావాలన్నా దొరుకుతుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
20 గొర్రెల అపహరణ
20 గొర్రెల అపహరణ
20 గొర్రెల అపహరణ


