అసమర్థ పాలనలో.. అన్నదాత ఆక్రోశం
పుట్లూరు: అసమర్థ పాలనలో అన్నదాత ఆక్రోశం ఏ స్థాయిలో ఉంటుందనేందుకు పుట్లూరు మండలం కడవకల్లు ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర.. ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని అరటి సాగు చేపట్టాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ధర ఒక్కసారిగా పతమైంది. గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని పలుమార్లు రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చివరకు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. దీంతో బుధవారం రైతు నాగేంద్ర డోజర్ సాయంతో అరటి చెట్లను పూర్తిగా తొలగించాడు. పంట పెట్టుబడి, కౌలు ఖర్చులు, మందులు తదితరాలు కలుపుకుని దాదాపు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అరటి రైతులను ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి సూరి డిమాండ్ చేశారు.


