సమర్థవంతంగా విధులు నిర్వర్తించండి
అనంతపురం టవర్‌క్లాక్: సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్నన పొందాలని ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన పది మంది ఏఓలకు గురువారం తన చాంబర్‌లో గిరిజమ్మ పోస్టింగ్ ఉత్తర్వులు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీలో ఏఓగా పనిచేస్తున్న బి.రత్నాబాయిని పెద్దపప్పూరు ఎంపీడీఓగా, కుందుర్పి ఏఓ హరికృష్ణ బాలాజీని చిలమత్తూరు ఎంపీడీఓగా, కళ్యాణదుర్గం ఏఓ దేవదాస్‌ను గుంతకల్లు ఎంపీడీఓగా, కూడేరు ఏఓ రాధాకృష్ణను విడపనకల్లు ఎంపీడీఓగా, గార్లదిన్నె ఏఓ దామోదరమ్మను హిందూపురం ఎంపీడీఓగా, బుక్కపట్నం ఏఓ అశోక్‌రెడ్డిని నల్లచెరువు ఎంపీడీఓగా, కనగానపల్లి ఏఓ వెంకటాచలపతిని అదే మండలానికి ఎంపీడీఓగా, గుడిబండ ఏఓ గంగాధర్‌ను అగళి ఎంపీడీఓగా, రొద్దం ఏఓ రామ్‌కుమార్‌ను తనకల్లు, ఎంపీడీఓగా, నల్లచెరువు ఏఓ రామకృష్ణను గాండ్లపెంట ఎంపీడీఓగా పోస్టింగ్ ఇచ్చారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ


