శత ఉత్సవం.. భక్త పరవశం
ప్రశాంతి నిలయం: అశేష భక్తకోటి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సత్యసాయి శత జయంతి వేడుకలు గురువారం సాయంత్రం వేద పఠనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సాయికుల్వంత్‌హాలులో కూర్చుని... బాబా మహాసమాధిని దర్శించుకుని పరవశించిపోయారు. బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కాంతులతో ప్రశాంతి నిలయం వర్ణ రంజితమైంది.
‘మహానారాయణ సేవ’ ప్రారంభం..
సత్యసాయి శతజయంతి వేడుకలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మహా నారాయణ సేవ ప్రారంభించింది. రోజూ 50 వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించే ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు గురువారం ప్రారంభించారు. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందించనున్నారు. ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వద్ద పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 కౌంటర్ల ద్వారా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ మహానారాయణ సేవ కొనసాగుతుందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.
పరవశించిన భక్తజనం..
సత్యసాయి శతజయంతి వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ ఫ్లూట్ వాయిద్య కారుడు అనిర్బన్ రాయ్ వాయిద్య కచేరీ నిర్వహించారు. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో వేదపఠనంతో వేడుకలు ప్రారంభం కాగా, ఆ తర్వాత ఫ్లూట్ వాయిద్య విద్వాంసుడు అనిర్బన్ రాయ్ తన బృందంతో కచేరీ నిర్వహించారు. చక్కటి స్వరాలతో సత్యసాయిని కీర్తిస్తూ సాగిన కచేరీతో భక్తులు తన్మయత్వం చెందారు. వాయిద్య కారులు బృందాన్ని ఆర్‌జే రత్నాకర్ రాజు ఘనంగా సన్మానించారు.
మధురం... సత్యసాయి చరితం...
సత్యసాయి జీవిత వైభవాన్ని చాటుతూ గురువారం సాయంత్రం సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆలరించాయి. విద్యార్థులు చక్కటి నృత్య ప్రదర్శనతో సత్యసాయి జీవిత వైభవాన్ని కళ్లకు కట్టారు.
తరలివస్తున్న ప్రముఖులు..
బాబా శత జయంత్యుత్సవాల్లో భాగంగా 19న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ , 22న నిర్వహించే సత్యసాయి విద్యా సంస్థల స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి శతజయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఆకట్టుకున్న లేజర్ షో
సత్యసాయి చరిత్రను తెలియజెప్పే విధంగా చిత్రావతి నది ఒడ్డున అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞఆనంతో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది.
అట్టహాసంగా ప్రారంభమైన
సత్యసాయి శత జయంత్యుత్సవాలు
దేశ విదేశాల నుంచి
భారీగా తరలివచ్చి భక్తులు
‘నారాయణ సేవ’ను ప్రారంభించిన ఆర్‌జే రత్నాకర్ రాజు
అలరించిన అనిర్బరాయ్
ఫ్లూట్ వాయిద్య కచేరీ
‘మధురం.. సాయి చరితం’ అంటూ
అలరించిన చిన్నారులు
ఎటు చూసినా సత్యసాయి రూపమే...ఎవరి నోట విన్నా సాయి నామమే. సాయి సూక్తులు..సత్య వాక్కులతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనిస్తోంది.
దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తజనం ప్రేమ తత్వం...సేవా భావంతో స్ఫూర్తిని చాటుతోంది. బాబా శత జయంతి ఉత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభం కాగా...ప్రశాంతి నిలయం ఆధ్యాత్మికానందంలో మునిగితేలుతోంది.
శత ఉత్సవం.. భక్త పరవశం
శత ఉత్సవం.. భక్త పరవశం
శత ఉత్సవం.. భక్త పరవశం
శత ఉత్సవం.. భక్త పరవశం
శత ఉత్సవం.. భక్త పరవశం
శత ఉత్సవం.. భక్త పరవశం


