కారు బోల్తా.. 8 మందికి గాయాలు
పెనుకొండ రూరల్: కారు బోల్తా పడిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నారనాగేపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ ఉపాధి కోసం బెంగళూరుకువెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలసి అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం మొక్కు చెల్లించుకుని, కారులో తిరుగు ప్రయాణమయ్యారు. పెనుకొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న 20 అడుగుల లోతైన పల్లంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న కవిత, సాలమ్మ, సుజాత, అనురాధ, అశ్విని, హేమవాణి, అభినాష్, కృతి, గంగాద్రి గాయపడ్డారు. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కవిత, సాలమ్మను బెంగళూరుకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


