కదిరిలో మద్యం మాఫియా..!
కదిరి: చందబ్రాబు సర్కార్ వచ్చాక కదిరిలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ తాము అమ్మిందే మందు..చెప్పిందే రేటు...అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కదిరి ఎకై ్సజ్ శాఖ పరిధిలోని 12 మద్యం దుకాణాలూ స్థానిక ఎమ్మెల్యే కందికంట వెంకట ప్రసాద్ అనుచరులే నిర్వహిస్తుండటం... ఆయా దుకాణాల ద్వారా వచ్చే డబ్బు రోజూ సాయంత్రానికి కందికుంట ఇంటికే చేరుతుండటంతో ఎకై ్సజ్ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక అధికారం అండతో దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా ఆలయాలు, విద్యాలయాల సమీపంలోనే ఏర్పాటు చేశారు. అయినా వారిని అడిగేవారే లేకుండా పోయారు.
అదనపు వడ్డింపు..
పేరుకు ప్రభుత్వం టెండర్లు పిలిచి వైన్ షాపులు కేటాయించినా అవన్నీ ‘కందికుంట’ మనుషులే దక్కించుకున్నారు. దీంతో సిండికేట్‌గా మారి ఎంఆర్‌పీపై క్వార్టర్‌కు రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున అదనంగా తీసుకుంటున్నారు. ఈ విషయం ఎకై ్సజ్‌శాఖ అధికారులందరికీ తెలుసని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఈ అదనపు డబ్బు మొత్తం కందికుంట జేబులోకి వెళ్తోందని కదిరి మండలం సున్నపుగుట్టతండాకు చెందిన టీడీపీ నేత ఒకరు చెబుతున్నారు.
కర్ణాటక మద్యంతో పట్టుబడిన
కందికుంట అనుచరుడు..
రెండు రోజుల క్రితం పట్టణంలోని టీడీపీ నాయకుడు జహ ఇంట్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు సోదా చేయగా.. 30 కేసుల కర్ణాటక మద్యం బాటిళ్లు దొరికాయి. అతను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ముఖ్య అనుచరుడు. భార్యాభర్తలు గొడవ పడితేనే వెంటనే కేసు నమోదు చేసి ఆ విషయం మీడియాకు వివరించే పట్టణ సీఐ నారాయణరెడ్డి ఈ కేసు వివరాలు మాత్రం మీడియాకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఎకై ్సజ్ పోలీసులు సైతం ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు.
ఊరూరా బెల్ట్ దుకాణాలు..
కదిరి నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే కందికుంట కనుసన్నల్లో 356 బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కదిరి మున్సిపల్ పరిధిలో 94, సమీపంలోని కుటాగుళ్లలో మరో 4 బెల్టు దుకాణాలున్నాయంటే ఇక్కడ మద్యం మాఫియా ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కుటాగుళ్లలోని ఓ బెల్టు దుకాణం వద్ద టీడీపీ కార్యకర్తలు గొడవ చేసి ఆఖరుకు వైద్యం చేసిన డాక్టర్ల మీద కూడా గొడవకు దిగిన విషయాన్ని టీడీపీ నేతలే గుర్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్టు దుకాణం ఉందని, కొన్ని గ్రామాల్లో నాలుగైదు కూడా ఉన్నాయని వీరంతా టీడీపీ సభ్యత్వం ఉన్నవారేనని, ఒక్కోసారి పోటీ ఎక్కువై బెల్టు దుకాణాల నిర్వాహకుల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని ఓ టీడీపీ నేత తెలియజేశారు.
ఇంట్లో కర్ణాటక మద్యం నిల్వ చేసిన
‘కందికుంట’ అనుచరుడి అరెస్ట్
మద్యం దుకాణాల్లో ఫుల్ బాటిల్‌పై రూ.40 అదనం
క్వార్టర్ బాటిల్‌పై ఎంఆర్‌పీకి మించి రూ.10 వడ్డింపు
అదనపు సొమ్మంతా
‘కందికుంట’ జేబులోకే
కర్ణాటక మద్యం పట్టుకున్నది వాస్తవమే
రెండు రోజుల క్రితం కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి, నేను, మా సిబ్బంది వెళ్లి కదిరికి చెందిన టీడీపీ కార్యకర్త జహ అనే వ్యక్తి ఇంట్లో 30 బాక్స్‌ల కర్ణాటక మద్యం పట్టుకున్నాం. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా... న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.
– వీరారెడ్డి, ఎకై ్సజ్ సీఐ, కదిరి
మద్యం మాఫియా డాన్ కందికుంట
టీడీపీ పాలనలో కదిరిలో ఎంఆర్‌పీకి మద్యం అమ్మడం లేదు. ఫుల్ బాటిల్‌పై రూ.40, క్వార్టర్‌పై రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకే ఇలా జరుగుతోంది. ఎందుకంటే మద్యం దుకాణాలన్నీ ఆయన అనుచరులవే. ఇంకా కొందరు ఆయన అనుచరులు కల్తీ మద్యంతో పాటు కర్ణాటక మద్యం కూడా ఇళ్లలో నిల్వ చేసి అమ్ముతున్నారు. ఈ మాఫియాకు డాన్ ఆయనే.
– ప్రణిత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ, కదిరి
కదిరిలో మద్యం మాఫియా..!
కదిరిలో మద్యం మాఫియా..!
కదిరిలో మద్యం మాఫియా..!


