శత ఉత్సవం.. వర్ణ శోభితం
● సత్యసాయి శత జయంతికి భారీగా ఏర్పాట్లు
● విద్యుత్‌దీపాలతో ప్రజ్వరిల్లుతున్న ప్రశాంతి నిలయం
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. స్వాగత తోరణాలు, శత జయంతి లోగోలను పట్టణంలోని కూడళ్లలో ఏర్పాటు చేశారు. ప్రశాంతి నిలయంతో పాటు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విద్యా భవనాలు, ఆర్చ్‌లకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఆవాసాలు, అన్నప్రసాదాల పంపిణీకి షెడ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు భవనాలకూ నూతన శోభ తెచ్చారు. దీంతో రాత్రి వేళ పట్టపర్తి విద్యుత్ వెలుగుల్లో వర్ణ శోభితంగా మారింది. ఇక లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సిద్ధం చేశారు. చిత్రావతిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సత్యసాయి పార్కును ఈ నెల11న ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. మామిళ్లకుంట క్రాస్ నుంచి పుట్టపర్తి వరకూ రహదారి వెంట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
శత ఉత్సవం.. వర్ణ శోభితం
శత ఉత్సవం.. వర్ణ శోభితం
శత ఉత్సవం.. వర్ణ శోభితం


