కల్యాణం.. కమనీయం
హిందూపురం: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత గుడ్డం రంగనాథస్వామి బ్రహోత్సవాలను పురస్కరించుకుని గుడ్డం రంగనాథస్వామికి శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పల్లకీలో ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదిక ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదపండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
నేడు బ్రహ్మ రథోత్సవం
గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాన్ని పురస్కరించుని ఆదివారం గుడ్డం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు రథోత్సవాన్ని వైభవంగా జరగనుంది.
ద్విచక్ర వాహనాల ఢీ
● ముగ్గురికి గాయాలు
లేపాక్షి: మండలంలోని చోళ సముద్రం జాతీయ రహదారిపై శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో మైదుగోళం గ్రామానికి చెందిన సోమశేఖర్ హిందూపురం నుండి మైదుగోళానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. చోళ సముద్రం గ్రామానికి చెందిన హరీష్, మూర్తి చోళ సముద్రం నుంచి హిందూపురం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ముగ్గురూ గాయపడ్డారు. అందులో సోమశేఖర్ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య పరీక్షలు నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కల్యాణం.. కమనీయం
కల్యాణం.. కమనీయం


