జోరుగా.. హుషారుగా..
400 మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారులు టెన్నికాయిట్‌లో తలపడుతున్న కర్నూలు – అనంతపురం జట్లు నెల్లూరు, విశాఖ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న వాలీబాల్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న రెవెన్యూ క్రీడలు శనివారం హోరా హోరీగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తిలకించడంతో పాటు క్రీడాకారులతో మాట్లాడారు. నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులకు ఇలాంటి పోటీలను నిర్వహించడం ద్వారా మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్డీటీ ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ ఆనంద్, ఉద్యోగులు వీక్షించారు. ప్రాచీన కళా ప్రదర్శనలు, జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతికుమార్ మిమిక్రీ, సినీ డ్యాన్స్, ఏకపాత్రాభినయంలో రెవెన్యూ ఉద్యోగులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
వాలీబాల్ విజేత నంద్యాల
● పురుషుల వాలీబాల్ ఫైనల్ పోటీల్లో తూర్పుగోదావరి జట్టుపై నంద్యాల జట్టు జయభేరి మోగించింది.
● బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో విజయనగరంపై 22–2 స్కోర్‌తో అన్నమయ్య జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టు 21–15 స్కోర్‌తో తిరుపతిపై గెలిచింది.
● మహిళల డబుల్స్‌లో విజయనగరం జట్టు 21–12 స్కోర్ తేడాతో అల్లూరి సీతారామరాజు జట్టుపై, అనంతపురం జట్టు 21–12 స్కోర్‌తో వైఎస్సార్ కడప జట్టుపై విజయం సాధించాయి.
● టెన్నికాయిట్‌లో విశాఖపట్టణం జట్టు 21–11 పాయింట్ల తేడాతో విజయనగరంపై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
● క్యారమ్స్ పురుషుల విభాగం ఫైనల్స్‌లో నెల్లూరు జట్టు బాపట్లపై 33–0 స్కోర్‌తో ఘన విజయం సాధించింది.
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
కబడ్డీలో అనకాపల్లిపై విజయం సాధించడంతో ఆనందోత్సవాల్లో విజయనగరం జట్టు సభ్యులు
రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలతో ఆర్డీటీ మైదానంలో సందడి
చివరి దశకు క్రీడలు
జోరుగా.. హుషారుగా..
జోరుగా.. హుషారుగా..
జోరుగా.. హుషారుగా..
జోరుగా.. హుషారుగా..
జోరుగా.. హుషారుగా..


