 
															డిసెంబర్‌లోపు షీప్ సొసైటీ ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు డిసెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. స్థానిక షీప్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్, పర్సన్ ఇన్‌చార్జి /డీడీ డాక్టర్ వై.రమేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక గొర్రెల సంఘాలను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా గడువు మీరిన సంఘాలకు త్వరలో ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని సభ ఆమోదించింది. జీవాలకు, కాపర్లకు బీమా సదుపాయం, షెడ్ల నిర్మాణాలను ప్రోత్సహకం, జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా మని తెలిపారు.
 
							డిసెంబర్‌లోపు షీప్ సొసైటీ ఎన్నికలు
 
							డిసెంబర్‌లోపు షీప్ సొసైటీ ఎన్నికలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
