 
															పేదలకు వైద్యం దూరం చేస్తే ఊరుకోం
పుట్టపర్తి: ‘‘నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. దీనివల్ల వైద్యవిద్య చదవాలనుకునే పేద కుటుంబాల్లోని విద్యార్థులకూ మేలు జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసి పెత్తందార్లకు మేలు చేసేందుకు సిద్ధ పడింది. పేదలకు వైద్యాన్ని దూరం చేస్తే చూస్తూ ఊరుకోం’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొత్తకోట కేశప్ప, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుధాకర్ తదితరులతో కలిసి కొత్తకోట, గూనిపల్లి, సిద్దరాంపురం, బుచ్చయ్యగారిపల్లి, నార్శింపల్లి తండా గ్రామ పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సభల్లో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. జగన్ మీద కక్ష గట్టిన కూటమి సర్కార్... గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
అభివృద్ధికి మంగళం..
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలకు మంగళం పాడిందని శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అరాచకాలకు, అవినీతికి దారులు వేసిందని దుయ్యబట్టారు. కూటమి నేతలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో విచ్చల విడిగా జూదం ఆడించటంతో పాటు బెట్టింగ్, కల్తీ మద్యం అమ్మి పేదల ఉసురు పోసుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలనతో అన్ని వర్గాల వారు విసిగి పోయారన్నారు. 2029లో తప్పక జగన్‌ను ఆశీర్వదిస్తారన్నారు. పేదలకు మంచి చేసే జగనన్నను మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఉండ్ల కిష్టయ్య, విజయారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కొత్తకోట రఘు, జిల్లా అగ్రి అడ్వయిజరీ మాజీ అధ్యక్షుడు ఆవుటాల రమణారెడ్డి, గ్రామ సచివాలయాల కన్వీనర్ గోవర్దన్‌రెడ్డి, మండల పరిశీలకులు గంగాధర్, మల్లికార్జున, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుష్ప, నేతలు నాగమల్లీశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అరుణబాయి, సర్పంచులు నాగమణి, గోవిందరెడ్డి, రమణయ్య, భాస్కర్‌రెడ్డి, కృష్ణమ్మ బాయి, భాస్కర్ నాయక్, రఘునాథరెడ్డి, మదిరేబైలు రవీంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, ఎంపీటీసీలు చెన్నుడు, హర్షవర్దన్‌రెడ్డి, పుల్లారెడ్డి, వెంకటరెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, మల్లేశ్, కేపీ నాగిరెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామలింగారెడ్డి, ఓబిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి, వడ్డె లక్ష్మీనారాయణ, నిరంజన్‌రెడ్డి, బుచ్చయ్యగారిపల్లి వైస్ సర్పంచ్ కృష్ణరెడ్డి, అమరనాథరెడ్డి, దామోదర్‌రెడ్డి, నాగభూషణ, మాల్యవంతం మారుతి తదితరులు పాల్గొన్నారు
కూటమి సర్కార్‌ను హెచ్చరించిన
దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటిసంతకాల సేకరణ’
 
							పేదలకు వైద్యం దూరం చేస్తే ఊరుకోం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
