పుట్టపర్తి అర్బన్: నాలుగు నెలల నుంచి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్లు వాపోయారు. గురువారం ఇన్‌చార్జ్ పీడీ శ్రీలక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 200 మంది టీఏలు ఉన్నారన్నారు. కొంత మందికి నాలుగు నెలలు, మరికొంత మందికి రెండు నెలల జీతాలు చెల్లించకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిందన్నారు. ఇంటి అద్దెలు, ఈఎంఐలు, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. మానసిక క్షోభతో పలువురు అనారోగ్యం పాలయ్యారన్నారు. జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.


