సాయి కీర్తనం.. ఆధ్యాత్మిక సంబరం
ప్రశాంతి నిలయం: సత్యసాయి కీర్తనలతో ప్రశాంతి నిలయం మార్మోగింది. మూడు రోజులుగా జరుగుతున్న గుజరాత్ నూతన సంవత్సర వేడుకలు గురువారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్ర సాయికుల్వంత్ సభా మందిరంలో శ్రీ సత్యసాయి స్కూల్ సూరత్ విద్యార్థులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సంగత సంగీత విద్వాంసురాలు దీపికా కన్‌సారి బృందం సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో భక్తులను అలరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాఽధిని దర్శించుకున్నారు.


