 
															చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు
రామగిరి/ ముదిగుబ్బ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. దీపావళి పండుగ రోజున జరిగిన ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో చీకట్లు నింపాయి. వివరాలిలా ఉన్నాయి. కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన కురుబ పెండ్లి జీవి చంద్రశేఖర్ (56), దివిటీ రామలింగయ్య (53) నరక చతుర్దశి సందర్భంగా సోమవారం ఉదయం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో గల దేవస్థానానికి టీవీఎస్ ఎక్సెల్ మెపెడ్‌పై వెళ్లారు. అక్కడ స్వామిని దర్శించుకుని రాత్రి ఏడు గంటల సమయంలో స్వగ్రామానికి బయల్దేరారు. పేరూరు సమీపంలోని కురుగుండ్ల కాలనీ వద్ద వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఎగిరి కిందపడిన చంద్రశేఖర్, రామలింగయ్య మీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రశేఖర్‌కు ఇద్దరు కుమారులు, రామలింగయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తారనుకున్న వారు విగతజీవులై రావడంతో గ్రామంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. పేరూరు సమీపంలోని పెన్నా నది నుంచి రోజూ ఇసుక లోడ్‌తో ట్రాక్టర్లు వేగంగా వస్తుండటంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.
జేసీబీని ఢీకొని..
బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషయ్య (55), కృష్ణ (53)తో పాటు మోహన్ అనే వ్యక్తి సోమవారం పని నిమిత్తం ముదిగుబ్బ మండల కేంద్రానికి వచ్చారు. పని ముగించుకుని రాత్రి ముగ్గురూ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలోని గుంజేపల్లి చెరువు కట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీని లైట్ల వెలుతురులో గుర్తించక ముందుకెళ్లారు. దీంతో జేసీబీ బకెట్‌ను ఢీకొని శేషు, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మోహన్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సీఐ శివరాముడు ప్రమాద స్థలిని పరిశీలించారు.
మృతి చెందిన శేషయ్య, కృష్ణ (ఫైల్)
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
 
							చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు
 
							చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు
 
							చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు
 
							చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
