రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

Oct 26 2025 6:53 AM | Updated on Oct 26 2025 6:53 AM

రెవెన

రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం 12 మందితో కూడిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కలెక్టరేట్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రెటరీ షేక్‌ మైనుద్దీన్‌ తెలిపారు. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కలెక్టరేట్‌ ఏఓ వెంకటనారాయణ, కార్యదర్శిగా రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ట్రెజరర్‌గా కె.మహబూబ్‌ బాషాను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడు వెంకటనారాయణ మాట్లాడుతూ కలెక్టరేట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు. అనంతరం పుట్టపర్తి డివిజన్‌ నూతన కమిటీని సైతం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నాగార్జునశెట్టి తెలిపారు. డివిజన్‌ అధ్యక్షులుగా డిప్యూటీ తహసీల్దార్‌ కె.నరసింహులు, ట్రెజరర్‌గా ఆర్‌ఐ గణేష్‌రెడ్డి, సెక్రెటరీగా డిప్యూటీ తహసీల్దార్‌ మనోజ్‌ కుమార్‌రెడ్డితో పాటు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నట్లు వివరించారు.

సైనిక లాంఛనాలతో

జవాన్‌ అంత్యక్రియలు

పెనుకొండ రూరల్‌: అనారోగ్యంతో మృతి చెందిన జవాన్‌ అంత్యక్రియలు సైనిక లాంఛ నాలతో జరిగాయి. శెట్టిపల్లికి చెందిన శ్యాం ప్రసాద్‌ నాయుడు 2005లో ఆర్మీ జవాన్‌గా చేరాడు. జమ్ము కశ్మీర్‌, అసోం, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఏడాది నుంచి పంజాబ్‌ రాష్ట్రం ఫిరోజ్‌పూర్‌లో పనిచేస్తున్నారు. గత నాలుగు రోజులుగా టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. శనివారం ఆర్మీ అధికారులు జవాన్‌ భౌతికకాయాన్ని స్వగ్రామం శెట్టిపల్లికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు జవాన్‌ను చూసి బోరున విలిపించారు. మృతుని అన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ వెంకట నాయుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే బంధువులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి సవిత, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు జవాన్‌ను కడసారి చూపు చూసి నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు శవపేటికపై పుష్ప గుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం చేశారు. పోలీసులు తుపాకులతో గౌరవ వందనం చేశారు. జవాన్‌కు చెందిన తోటలోనే ఖననం చేశారు.

రెవెన్యూ సర్వీసెస్‌  అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక 1
1/1

రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement