రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Oct 26 2025 6:53 AM | Updated on Oct 26 2025 6:53 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

కనగానపల్లి/ అగళి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాము అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను శనివారం ఉదయం తన తల్లి చెన్నమ్మ (60)తో కలసి బెంగుళూరు నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. కనగానపల్లి మండలం దాదులూరు సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న దిమ్మెను వేగంగా ఢీకొట్టింది. వెనుక సీటులో కుర్చున్న చెన్నమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవింగ్‌ చేస్తున్న రాము తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్యాం చూడటానికెళ్లి మృత్యువాత..

● అగళి మండలం బొమ్మరసనపల్లికి చెందిన రామచంద్రప్ప, అనిత దంపతుల కుమారుడు తనోజ్‌ (20), రాగేలింగన్నపల్లికి చెందిన రూపా, నరసింహమూర్తి దంపతుల కుమారుడు అక్షయ్‌ శనివారం కర్ణాటకలోని మారికణవె డ్యాం చూడటానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. మార్గం మధ్యంలోని హరియూర్‌ సమీపంలోని ధాబా వద్ద ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో తనోజ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అక్షయ్‌ దావణగెరె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం 1
1/3

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం 2
2/3

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం 3
3/3

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement