 
															వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడె
ఉరవకొండ: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వై.ప్రణయ్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థి విభాగం నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, సహకరించిన పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డికి ప్రణయ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేసి, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు.
వైద్య కళాశాలలను
ప్రభుత్వమే నిర్వహించాలి
మడకశిర: వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ అధ్యక్షతన మడకశిర ఉపాధ్యాయ భవనంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. పెనుకొండ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని కోరారు. పీపీపీ విధానం పేరిట ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కళాశాలలను ఇవ్వకూడదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జపాన్ని కూటమి ప్రభుత్వం వీడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల అవసరం ప్రజలకు చాలా ఉందన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాస్పత్రులు, మెడికల్ కాలేజీలు ప్రజలను ఆదుకున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి పెనుకొండ మెడికల్ కాలేజీని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. తద్వారా పేదలు ఉచితంగా వైద్య విద్య అభ్యసించడానికి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పొదడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, డీహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు భూతన్న, జిల్లా కార్యదర్శి మహలింగప్ప, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగనాథ్, అశ్వర్థ, ఎఎఫ్‌ఐ నాయకులు మహీంద్ర, గణేష్, సాయి, దేవ, డీవైఎఫ్‌ఐ నాయకుడు ముత్యాల మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ గౌరవం పెంచాలి
● నేర సమీక్షలో సిబ్బందికి
ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
పుట్టపర్తి టౌన్: ప్రతి పోలీసు అఽధికారి నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తించి పోలీస్ శాఖ గౌరవం పెంచాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక సాయి ఆరామంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌లతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్, పోక్సో కేసులు, మహిళలపై జరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రసంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించి శిక్ష పడేలా చేయడం కూడా పోలీసుల బాధ్యతేనని గుర్తించాలన్నారు. పోలీసులు అంటే నేరస్తులకు భయంపుట్టే విధంగా పనిచేయాలన్నారు. గస్తీలు ముమ్మరం చేయడంతో పాటు విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నారు. సీసీ కెమెరాల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించి దేవాలయాలు, వీధులు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు.
అవగాహన కల్పించాలి..
ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలు... వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సందర్శనలు, పల్లె నిద్ర చేపట్టి ప్రజలతో మమేకం కావాలన్నారు. కార్యక్రమంలో పీపీలు రామ్‌నాయక్, లక్ష్మీ నారాయణ, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్‌కుమార్, నర్సింగప్ప, శివనారాణస్వామి, ఆదినారాయణ, స్పెషల్‌బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఐటీకోర్ టీమ్ ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
							వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడె
 
							వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడె

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
