 
															మంచు కురిసే వేళలో...
ఇల్లు, పొలం, రోడ్లు.. ఇలా ఎటు చూసినా తెల్లటి పొగమంచే. తుపాను ప్రభావంతో ఆకాశం మేఘామృతమై జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అయితే కర్ణాటకకు ఆనుకుని ఉన్న గోరంట్ల, ఓడీచెరువు, అమడగూరు, నల్లచెరువు, తనకల్లు, మడకశిర, లేపాక్షి, రొళ్ల తదితర
మండలాల్లో మాత్రం శనివారం తెల్లవారుజాము నుంచే మంచు
కమ్మేసింది. రోడ్డుపై ఎదురుగా
ఏమి వస్తున్నాయో కనిపించనంతగా
పొగమంచు వ్యాపించింది. ఉదయం ఎనిమిది గంటల వరకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే వేగం తగ్గించి, హారన్ మోగిస్తూ నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
– పుట్టపర్తి అర్బన్:
 
							మంచు కురిసే వేళలో...
 
							మంచు కురిసే వేళలో...

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
