చంద్రబాబు పతనం మొదలైంది | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పతనం మొదలైంది

Oct 26 2025 6:53 AM | Updated on Oct 26 2025 6:53 AM

చంద్రబాబు పతనం మొదలైంది

చంద్రబాబు పతనం మొదలైంది

రొద్దం: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారుకు పతనం మొదలైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ స్పష్టం చేశారు. లూలూ, ఉర్సా కంపెనీలకు రూ.కోట్లు విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని, పేద విదార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తూ 17 మెడికల్‌ కాలేజీలను తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా అప్పజెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సాయంత్రం మండలంలోని తురకలాపట్నం, పెద్దిపల్లి, ఎల్‌జీబీనగర్‌, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి తదితర గ్రమాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, అప్పటి వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సమాయత్తం అవుతున్నారన్నారు. మెడికల్‌ కాలేజీల పరిరక్షణ కోసం ఈ నెల 28న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కోటి సంతకాల సేకరణతో కూటమి కుట్రలను భగ్నం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తిమ్మయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ తిమ్మయ్య, నాయకులు ఎన్‌.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సినిమా నారాయణ, శంకర్‌, చిలకల రవి, నారేంద్రరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మీదేవి, విశ్వనాథ్‌రెడ్డి, అమిర్‌, షానవాజ్‌, ఇస్లాపురం అంజి, గోపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో

పేదలకు నష్టం

కూటమి కుట్రలను

కోటి సంతకాలతో భగ్నం చేద్దాం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement