 
															తీరని యూరియా కష్టాలు
రొద్దం: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. కూటమి సర్కార్‌కు సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయమే మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నా కావాల్సినంత యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. గురువారం రొద్దం పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ ఉంటుందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజాము 5 గంటలకే అక్కడికి చేరుకుని క్యూ కట్టారు. అయితే 560 బస్తాల యూరియా మాత్రమే సరఫరా కావడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 180 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారంతా మధ్యాహ్నం తర్వాత ఉసూరుమంటూ వెనుదిరిగారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
