 
															కాలువలో వ్యక్తి మృతదేహం
కనగానపల్లి: ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం కనగానపల్లి మండలం బాలేపాళ్యం సమీపంలో కాలువలో బయటపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన నాగభూషణ (65) రెండు రోజుల క్రితం పంపనూరు వద్ద హంద్రీనీవా కాలువలో ఈ కొడుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కాలువ వెంబడి పరిశీలిస్తూ ముందుకు సాగారు. బాలేపాళ్యం సమీపంలో హంద్రీనీవా కాలువలో బుధవారం కనిపించిన మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
