నూతన జేసీగా మంత్రి మౌర్య భరద్వాజ్‌ | - | Sakshi
Sakshi News home page

నూతన జేసీగా మంత్రి మౌర్య భరద్వాజ్‌

Oct 10 2025 6:20 AM | Updated on Oct 10 2025 6:20 AM

నూతన

నూతన జేసీగా మంత్రి మౌర్య భరద్వాజ్‌

ఏపీ మారిటైం బోర్డు సీఈఓగా

అభిషేక్‌కుమార్‌ బదిలీ

ప్రశాంతి నిలయం: జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ జేసీగా ఉన్న అభిషేక్‌ కుమార్‌ను ఏపీ మారిటైం బోర్డు సీఈఓగా బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్వర్వులు జారీ చేశారు. 2022 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్‌ ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక 2023 డిసెంబర్‌ 21న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. 22 నెలల పాటు జేసీగా ఆయన జిల్లా వాసులకు సేవలందించారు.

నదిలో చిక్కుకున్న ట్రాక్టర్‌

కొత్తచెరువు: మండలంలోని ఇరగంపల్లి సమీపంలో వంగపేరు నది ఉధృతిలో ట్రాక్టర్‌ చిక్కుకుంది. పోలీసులు స్పందించి గ్రామస్తుల సహాయంతో ట్రాక్టరును, అందులోని రైతును సురక్షితంగా బయటకు తీశారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తచెరువు మండలం ఇరగంపల్లికి చెందిన రైతు వెంకటేష్‌ వంగపేరు నది పాత వంతెనపై మొక్కజొన్నలు ఆరబోశాడు. గురువారం ఎగువన కురిసిన వర్షాలకు నదికి వరద మొదలైంది. దీంతో రైతు హుటాహుటిన పంటను ట్రాక్టరులోకి చేర్చి.. నదిలో నుంచి బయటకు వస్తుండగా వరద ఉధృతి ఎక్కువై ట్రాక్టర్‌ తిరగబడింది. నది మధ్యలోనే చిక్కుకుపోయింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే గ్రామస్తులు చొరవ తీసుకుని రైతు వెంకటేష్‌ను కాపాడడంతో పాటు ట్రాక్టరును కూడా తాళ్ల సాయంతో బయటకు లాగారు. ఘటనలో రైతు పంట మొత్తం నష్టపోయాడు.

నేటి నుంచి

ఎన్టీఆర్‌ వైద్యసేవలు బంద్‌

ధర్మవరం అర్బన్‌: నేటి నుంచి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల బిల్లులు బకాయి పడిందన్నారు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

వీఆర్‌కు మడకశిర సీఐ

మడకశిర: స్థానిక ఆప్‌ గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ నగేష్‌బాబును వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నూతన సీఐగా జీవీ సుబ్రహ్మణ్యంను నియమించారు. నూతన సీఐ నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త టీచర్ల

ప్లేస్‌మెంట్స్‌కు కౌన్సెలింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లా నుంచి డీఎస్సీ–25కు ఎంపికై న కొత్త టీచర్లకు ప్లేస్‌మెంట్‌ (స్థానం) కోసం గురువారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఎస్జీటీలకు మ్యానువల్‌ కౌన్సెలింగ్‌, స్కూల్‌ అసిస్టెంట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్థానాలు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారంలోపు పూర్తికావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శిక్షణ కేంద్రాల్లోనే ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమై అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 167 మంది ఎస్జీటీలుండగా, 148 మంది తెలుగు, 14 మంది ఉర్దూ, ఐదుగురు కన్నడ ఉన్నారు. సీనియార్టీ ప్రకారం ఒక్కో అభ్యర్థికి ఖాళీలు డిస్‌ప్లే చేశారు. వారికి నచ్చిన స్థానాన్ని కోరుకున్నారు. ఇక 581 స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు తొలిసారి వెబ్‌ కౌన్సెలింగ్‌ కావడంతో ఆప్షన్ల నమోదులో కాస్తా గందరగోళానికి గురయ్యారు. అధికారులు వారి అనుమానాలను నివృత్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి వారి కౌన్సెలింగ్‌ పూర్తికానుంది.

నూతన జేసీగా  మంత్రి మౌర్య భరద్వాజ్‌ 1
1/2

నూతన జేసీగా మంత్రి మౌర్య భరద్వాజ్‌

నూతన జేసీగా  మంత్రి మౌర్య భరద్వాజ్‌ 2
2/2

నూతన జేసీగా మంత్రి మౌర్య భరద్వాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement