
పన్నులు తగ్గినా పాత ధరలే
జీఎస్టీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ జిల్లాలో ధరలు తగ్గింది లేదు. ఎక్కడజూసినా పాత రేట్లకే అమ్ముతున్నారు. గట్టిగా అడిగితే నీకు ఇష్టమైతే కొనుక్కో.. లేదంటే వెళ్లిపో. పెద్ద రూల్ మాట్లాడుతున్నావు.. అని కోప్పడుతున్నారు. – మురళీకృష్ణ, ఓడీ చెరువు
ఎవరికి లాభం?
జీఎస్టీ తగ్గింపు మంచిదే. సామాన్య ప్రజలకు ఈ ఫలాలు అందితే సంతోషమే. కానీ ఎక్కడా ఆ ప్రభావం కనబడలేదు. టూత్‌పేస్టులు, బ్రష్‌లు, పౌడర్లు, సైకిళ్లు, వ్యవసాయ పరికరాలు, మందులు వంటివి 5 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. కొన్ని రకాల మందులపై జీఎస్టీ పూర్తిగా లేకుండా చేశారు. కానీ ఈ తగ్గింపు ధరలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.
– రామమోహన్‌రెడ్డి, అడ్వకేట్, కదిరి

పన్నులు తగ్గినా పాత ధరలే