
ప్రభుత్వ బడిలో చేరేలా...
కదిరి అర్బన్: గతంలో కదిరి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలు లావణ్య తనదైన శైలిలో విద్యాబోధన సాగిస్తూ 54 మంది ఉన్న ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 184కు చేరేలా చేశారు. విద్యా ఉపకరణాలను తన సొంత డబ్బుతో కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేస్తూ వారిని చదువులపై దృష్టి సారించేలా చేశారు. ఈ క్రమంలో పాఠశాల వేళలు ముగిసిన తర్వాత ఇళ్ల వద్ద సాయంత్రం విద్యార్థులు చదువుకుంటుండడం గమనించిన ధనవంతులు సైతం ఆకర్షితులై తమ పిల్లలను అదే పాఠశాలలో చేర్పిస్తూ వచ్చారు. ఆమె సేవలకు గుర్తుగా 2017లో బెస్ట్ టీచర్ అవార్డును రోటరీ క్లబ్ ప్రదానం చేసింది. 2024లో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును ఎస్టీయూ అందజేసింది. ప్రస్తుతం సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మూర్తిపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు.