
16 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ సగటున 9.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా చిలమత్తూరు మండలంలో 46.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 40 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక పరిగి మండలంలో 35.4 మి.మీ, అమడగూరు 30.6, అగళి 29.2, మడకశిర 26.8, రొళ్ల 18.2, సోమందేపల్లి 17.0 , గోరంట్ల 15.2, పెనుకొండ 12.8, తాడిమర్రి 10.2, హిందూపురం 9.8, తనకల్లు 4.8, గుడిబండ 3.4, అమరాపురం 3.0, ఓడీచెరువు మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.