● టేకులోడు ఎంజేపీ పాఠశాల
విద్యార్థులకు కలెక్టర్ సూచన
చిలమత్తూరు: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు గర్వించేలా ప్రతి విద్యార్థీ బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. బుధవారం చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్‌లో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాల, విద్యార్థుల భోజన గది, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యాబోధన తదితర అంశాలపై విద్యార్థులతో ఆరా తీశారు. 1,100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేడు మద్యం
దుకాణాలకు లాటరీ
పుట్టపర్తి టౌన్: జిల్లాలో దరఖాస్తు చేసుకున్న మూడు మద్యం దుకాణాలకు గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో 12 బార్ల నిర్వహణకు టెండర్లు పిలవగా ఏడింటికి మాత్రమే దరఖాస్తులు అందాయి. వీటికి లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. మిగిలిన 5 బార్లకు మరోమారు పలు దఫాలుగా నోటిఫికేషన్ జారీ చేశారు. గడువు ముగిసే సమయానికి మడకశిర, కదిరి, హిందూపురంలోని బార్లకు 12 దరఖాస్తులు అందాయి. ధర్మవరంలో రెండు దుకాణాలకు దరఖాస్తులు అందలేదు. దరఖాస్తులు అందిన మూడు బార్లకు గురువారం ఉదయం లాటరీ నిర్వహించనున్నారు.
గర్వించేలా విద్య నేర్వాలి